వధూవరులను ఆశీర్వదించిన ‘వేముల’

వధూవరులను ఆశీర్వదించిన ‘వేముల’

ముద్ర ప్రతినిధి, జనగామ :  వరంగల్‌ పద్మశాలి జర్నలిస్టుల పరపతి సంఘం సభ్యుడు, ఆయుధం టీవీ వీడియో జర్నలిస్టు దాసరి కిరణ్‌ కుమార్తె మనీషా - ఉదయ్‌ వివాహం శనివారం ఘనంగా జరిగింది. వరంగల్‌ కొత్తవాడలోని పద్మశాలి కమ్యూనిటీ హాల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలకు గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు వేముల నాగరాజు, వేముల పూర్ణచందర్‌తో పాటు పలువురు జర్నలిస్టులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ రాయపర్తి మండల సీనియర్‌ నాయకులు కుందూరు విక్రమ్ రెడ్డి, వైఎస్సార్‌ టీపీ కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు కల్వచర్ల భిక్షపతి కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.