మండల కేంద్రంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

మండల కేంద్రంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

ముద్ర,తంగళ్ళపల్లి:-రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ నాయకులు స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు సమన్యాయ దిశగా ఉంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేనిఫెస్టో లోని 6 గ్యారంటీలను తొలి సంతకం తోనే  అమలు చేసిందని సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మహిళా సాధికారత దిశగారాష్ట్రంలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కొనసాగించవచ్చని చెప్పారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సాయం 10 లక్షలకు పెంచడం జరిగిందని రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు.మిగతా నాలుగు గ్యారంటీలను దఫళ వారీగా 100 రోజుల లోపు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులుపాల్గొన్నారు.