యూనిఫామ్ సివిల్ కోడ్,  ఎన్ ఆర్ సి ,370 ఆర్టికల్ పై మా పార్టీ విధానమే నా విధానం..

యూనిఫామ్ సివిల్ కోడ్,  ఎన్ ఆర్ సి ,370 ఆర్టికల్ పై మా పార్టీ విధానమే నా విధానం..
  • కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి 
  • జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో  చేరిన 6 గురు బిఆర్ ఎస్ కౌన్సిలర్లు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలో బిఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసిన 6 గురు కౌన్సిలర్లు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్సి జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిఆర్ ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు వల్లేపు రేణుక మోగిలి, సిరికొండ పద్మ సింగారవు, సిరికొండ భారతి, బండారి రజని, దాసరి లావణ్య, అల్లె గంగసాగర్ లు కాంగ్రస్ లో చేరగా  జీవన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ యూనిఫామ్ సివిల్ కోడ్,  ఎన్ ఆర్ సి ,370 ఆర్టికల్ పై మా పార్టీ విధానమే నా విధానమన్నారు. దేశ సమగ్రత కొరకు కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ.. బలహీన వర్గాలు రిజర్వేషన్లు తీసివేసి, రాజ్యాంగని మార్చే కుట్ర బిజేపీ చేస్తుందన్నారు. మోడీ అభిప్రాయాన్ని అరవింద్ వ్యక్తపరుస్తున్నాడు..  అరవింద్ కి అభివృద్ధి పై మాట్లాడడం చేతకాదు. మోడీ అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి  అరవింద్ ఎవరు అని ప్రశ్నించారు. తాను స్వతహాగా రాజకీయంలో ఎదిగిన వ్యక్తినని జకీయాలకు అతీతంగా నాకు అండగా నిలవాలని జగిత్యాల గౌరవం నిలబడేలా పనిచేస్తూ చూపిస్తానని పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని బ్రాహ్మన సంగం అధ్వర్యంలో వేద బ్రాహ్మణులతో పాటు  శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య కౌశిక ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డికి ఆశీర్వచనం అందించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ అధ్యక్షులు గిరి నాగ భూషణం, తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.