పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి- కలెక్టర్ శశాంక 

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి- కలెక్టర్ శశాంక 
రంగారెడ్డి, ముద్ర:పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను జాగ్రత్తగా నిర్వహించాలని చేవెళ్ళ పార్లమెంట్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంక ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను ఆదేశించారు.
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు వీలుగా సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను రిటర్నింగ్ అధికారి శశాంక ఆదివారం పరిశీలించారు. పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఓటింగ్ సరళి వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటింగ్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతగా జరిగేలా చూడాలని, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎన్నికల సంఘం నియమ, నిబంధనలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఓటరు హెల్ప్ లైన్ కౌంటర్ వద్దనే ఓటరు జాబితాలోని క్రమ సంఖ్య, పార్ట్ నెంబర్ ను చెక్ చేసుకోవాలని అన్నారు.ఏవైనా సందేహాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, అనవసర తప్పిదాలు జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు మే 8వ తేదీ వరకు నిర్వహించు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని రిటర్నింగ్ అధికారి తెలిపారు.
ఈ పరిశీలనలో రిటర్నింగ్ అధికారి కలెక్టర్ వెంట ఆర్డిఓ కందుకూరు/ ఎఆర్ఓ సూరజ్ కుమార్, సరూర్ నగర్ తహసిల్దార్ / ఏఈఆర్ఓ వేణుగోపాల్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.