నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం 

నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం 
  • బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రామన్నగారి వెంకటేశ్వర్ రెడ్డి 

ముద్ర.వనపర్తి:- నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రామన్నగారి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో  దాసరి లక్ష్మారెడ్డి బూత్  అధ్యక్షుడు ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి బలపరిచిన అభ్యర్థి భరత్ ప్రసాద్  గెలిపించాలని ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గోపాల్పేట మండలం బిజెపి  బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రామన్నగారి వెంకటేశ్వర్ రెడ్డి విచ్చేశా విచ్చేసి కమలం గుర్తుకు ఓటు వేసి వేయించి భారీ మెజార్టీతో భరత్ ప్రసాద్ గారిని గెలిపించాలని కోరారు.

గ్రామంలో అందని కలుస్తూ నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు  కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు  రుణమాఫీ చేయకపోవడం దురదృష్టకరం అన్నారు. మహిళలకు 2500/- రూపాయలు ఉద్యోగ భృతి పెళ్లి చేసుకున్న  అమ్మాయికి తులం బంగారం అని అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరఅన్నారు  నరేంద్ర మోడీ  మూడవసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని నాగర్కర్నూల్ పార్లమెంట్ సీటును గెలిపించాలని వారు కోరారు.

నాగర్ కర్నూల్ పార్లమెంట్లో ముగ్గురు అభ్యర్థులలో సమర్థుడు విద్యావంతుడు ప్రజా సేవలో ముందుండి పనిచేసే యువ నాయకుడు గెలిపించాలని, నరేంద్ర మోడీ దేశం కోసం నిత్యం నిరంతరం అభివృద్ధి పథంలో ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని సంకల్పంతో దేశభద్రత సంస్కృతి పట్ల అంకితభవంతో పనిచేస్తున్నారన్నారు. ప్రపంచ దేశాల్లోని నరేంద్ర మోడీ ఆదర అభిమానాలు 77% ఉన్నాయి  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను బిఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేరని, ఇంతవరకు పది సంవత్సరాలు పాలించిన బిఆర్ఎస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు అబద్ధాలు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చారని విమర్శించారు. కార్యక్రమంలో కొత్త మధు సింహారెడ్డి  ఎం శ్యాంసుందర్ రెడ్డి  విశ్వేశ్వర్ రెడ్డి శివ యాదవ్ వడ్డే శంకరయ్య కావలి బాలరాజ్   తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.