రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేస్తే నాకు పార్టీ బి పామ్ ఇస్తుందా....?

రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేస్తే నాకు పార్టీ బి పామ్ ఇస్తుందా....?
  • ఎంపీ గా ఉన్న సమయంలో నువ్వు తెచ్చిన నిధుల పైన శ్వేతాపత్రం విడుదల చేయి..
  • బూర బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడు : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల 

ముద్ర ప్రతినిధి భువనగిరి :నేను రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేస్తే నాకు పార్టీ బి పామ్ ఇస్తుందా అని కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బూర నర్సయ్య గౌడ్ ను ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక దీప్తి హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బూర నరసయ్య బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడని అన్నారు.

ఎంపీ గా ఉన్న సమయంలో నువ్వు తెచ్చిన నిధుల పైన శ్వేతాపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బూర నర్సయ్య గౌడ్ ప్రచారం లో ఏడూ నియోజకవర్గంలో  పోటీ చేసిన అభ్యర్థులు ఎందుకు ప్రచారంకి రావడంలేదని ప్రశ్నించారు.కులం , మతం అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తుండని విమర్శించారు. పసుమముల గ్రామంలో సర్వే 106 భూమి ఏడూ ఎకరాల భూమికి ఎల్ ఓ సి ఇచ్చిన ఘనుడు బూర అన్నారు. 2014 విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఎయిమ్స్ వచ్చిందని ఎయిమ్స్ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాడని చెప్పారు. భువనగిరి ఎంపీ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిధుల కోసం ,అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి మోడీ కలిసి పనులు చేశాడని చెప్పారు.
నువ్వు ఎంపీగా ఉండి ఎన్నిసార్లు ప్రధాన మంత్రి కలిశావని ప్రశ్నించారు.

కులమతాలకు అతీతంగా కోమటిరెడ్డి బ్రదర్స్ పనిచేస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే నన్ను ఎంపీ గా గెలిపించండని కోరారు. ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంట సేపటిలో ఎమ్మెల్యేలకు , ప్రజలకు అందుబాటులో ఉంటుండని నేను దొంగన ,ఫోర్జరీ చేసిన వ్యక్తి అయితే నాకు టికెట్ ఇస్తారా..?నేను తప్ప చేస్తే మా పార్టీ వాళ్లు నాకు టికెట్ రాకుండా చేసేవాళ్ళు అన్నారు.
మోడీ పదేళ్లు పాలనలో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రజల సొమ్మును దొచ్చుకుంటే మోడీ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు.

కేసీఆర్ తెలంగాణ నిధులు కావాలని మోడీని అడిగిన దాఖలాలు లేవన్నారు.బిజెపి ,బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులకు భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి పైన చిత్తశుద్ధి లేదన్నారు. చేనేత కార్మికులకు జిఎస్టి వేసి వాళ్ళును బ్రతకాకుండా చేశారని చెప్పారు.రష్యా ,చైనా దేశాలలో ప్రధాన మంత్రుల రాజ్యాంగం మార్చి పర్మినెంట్ ప్రధానమంత్రిగా ఉండాలని మోడీ చూస్తుండని చెప్పారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అత్యంత సన్నితుడనయితే భువనగిరి పార్లమెంట్ ప్రజలకు మంచిదేగా అబివృద్ది జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్ నేత, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పొతం శెట్టి వెంకటేశ్వర్లు, టిపిసిసి సభ్యులు రామ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ లక్ష్మి, శ్రీకాంత్ యాదవ్  పాల్గొన్నారు.