కేంద్రంలో బడా భాయ్ రాష్ట్రంలో చోటా భాయ్ ఇద్దరు ఒకటే

కేంద్రంలో బడా భాయ్ రాష్ట్రంలో చోటా భాయ్ ఇద్దరు ఒకటే
  • కాంగ్రెస్, బిజెపిలు దొందు దొందే
  • ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తున్న ప్రధాని మోడీ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • రాష్ట్రంలో 16 పార్లమెంట్ స్థానాల్లో బి.ఆర్.ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయం
  • భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా క్యామా మల్లేష్ యాదవ్  గెలుపు ఖాయం
  • రాష్ట్ర ప్రజలు మళ్ళీ  బిఆర్ఎస్ పాలన కోరుకుంటున్నారు
  • మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్ రెడ్డి


తుంగతుర్తి ముద్ర:-రాష్ట్రంలో ఉన్న చోట భాయ్  కేంద్రంలో ఉన్న బడా భాయ్ లు ఇద్దరూ ఒక్కటే అని కాంగ్రెస్, బీజేపీ  లోపాయకార ఒప్పందంతోనే రెండు పార్టీలు కొన్నిచోట్ల పోటీ  చేస్తున్నాయని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యుడు  గుంతకండ్ల  జగదీశ్వర్ రెడ్డి అన్నారు .శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని   మోడీలు కలిసి ప్రజా సమస్యలను పక్క దారి పట్టిస్తున్నారని రాష్ట్రానికి  మోడీతో ఒరిగిందేమీ లేదు అని అన్నారు. కేసీఆర్ మొదలుపెట్టిన బస్సు యాత్రతో రేవంత్ రెడ్డికి వణుకుడు మొదలైందని అందుకే ఈసీ కి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రచారాన్ని ఆపు చేయించారని అన్నారు . రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడింది ఒక్క కేసీఅర్ మాత్రమే అని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ కుట్రలు ప్రజలకు అర్దమైపోయాయని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో  రాష్ట్రంలో 16 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోందని అన్నారు .భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా క్యామ మల్లేష్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని అన్నారు .ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పాలనతో విసిగిపోయి మళ్లీ కెసిఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. తాము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ప్రజలువిశేష సంఖ్యలో హాజరవుతున్నారని తాము అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటు పార్లమెంట్ ఎన్నికల్లో చేయబోమని చెబుతున్నారని అన్నారు .పార్లమెంట్ ఎన్నికల్లో   బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి.  మల్లేష్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సన్నాక సమావేశంలో  భువనగిరి పార్లమెంట్  అభ్యర్థి క్యామ మల్లేష్ యాదవ్ ,తుంగతుర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ,జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు లతోపాటు పలువురు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.