ఎండల ప్రభావం - పాపం నీళ్లు లేక కల్లు తాగుతున్న రామచిలుక...

ఎండల ప్రభావం - పాపం నీళ్లు లేక కల్లు తాగుతున్న రామచిలుక...
  • నీటి కోసం వానరం పాట్లు 

ముద్ర.వీపనగండ్ల:- మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు అడిగింటిపోతుండగా చెరువులు కుంటల్లో తాగడానికి నీళ్లు లభించక మూగ జీవాలు, పక్షులు ఇబ్బందులు పడుతున్నాయి.గ్రామాలలో రైతులు తమ పశువులకు ఇంటి వద్దనే దాహార్తిని తీర్చుతున్నారు. గొర్రెల కాపర్లు తమ మూగజీవాలకు నీళ్లు లభించక అవస్థలు పడుతున్నారు.

జంతువులు పక్షులు సైతం తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి సోమవారం వీపనగండ్ల మండల కేంద్రంలో కనిపించింది.  ఒక వానరం దాహానికి తట్టుకోలేక ఓ  ఇంటి వద్ద నీళ్ల బిందె లో తాగటానికి నీటి కోసం ఇబ్బంది పడుతూ దాహం తీర్చుకుంది. అలాగే అడవిలో ఉండే పక్షులు నీళ్లు దొరకక ఒక రామచిలుక ఈత చెట్టుపై కల్లు తాగుతూ కనిపించింది. వేసవి నేపథ్యంలో కోతులు పక్షులు ఇతర జీవాల కోసం ప్రత్యేక నీటి వసతి కల్పించాలని, ప్రజలు సైతం ఇళ్ళ ముందర పక్షుల కోసం నీటితోట్లను ఏర్పాటు చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.