ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం - మాజీ శాసనసభ్యులు వై. అంజయ్య యాదవ్

ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం - మాజీ శాసనసభ్యులు వై. అంజయ్య యాదవ్

ముద్ర/షాద్ నగర్: ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు ఆరోపించారు. ఆదివారం షాద్ నగర్ మున్సిపాలిటీలోని 23, 24 వార్డుల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వాపోయారు. ప్రజలను మభ్య పెట్టేందుకే మరోమారు 5 గ్యారెంటీ ల పేరుతో పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల్లోకి వస్తున్నారని, వారి మాయమాటలను ఎవరు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు.

సకాలంలో రైతుబంధు, రైతు బీమా, పింఛన్లు, అన్నదాతలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వంటి అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చి పూర్తిస్థాయిలో అమలయ్యే విధంగా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒక్క ఆర్టీసీ ఫ్రీ బస్సు మినహాయించి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని వివరించారు. గారడి మాటలు చెప్పి గద్దెనెక్కుందికు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు వారిని ఇంటికి పంపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలిపించేందుకు ప్రజలందరూ కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి పార్లమూరు పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, కౌన్సిలర్ లు నందీశ్వర్, ఈశ్వర్ రాజు, జిటి శ్రీనివాస్, వెంకట్రాంరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు ఆకుల శ్రీశైలం, పిల్లి శేఖర్, శరత్ కుమార్ లు ఉన్నారు.