కర్నాటకలో రేపే  పోలింగ్.... వీడని బజరంగ్​బళీ ఫీవర్​

 కర్నాటకలో రేపే  పోలింగ్.... వీడని బజరంగ్​బళీ ఫీవర్​

కర్నాటకలో రేపే అసెంబ్లీ  ఎన్నికల పోలింగ్​. ఉత్కంఠ రేకెత్తిస్తున్న అసెంబ్లీ ఎన్నికలు. బీజేపీ, కాంగ్రెస్​ హోరాహోరీగా ప్రచారం చేశాయి. 224 స్థానాలకు ఒకే దశలో పోలింగ్​ నిర్వహిస్తారు. మ్యాజిక్​ మార్క్​ కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటున్న బీజేపీ. అధికారంలోకి వస్తామనే ఆశల్లో కాంగ్రెస్​ ఉంది. కర్నాటక ఎన్నికలను వీడని బజరంగ్​బళీ ఫీవర్​. బీజేపీ, కాంగ్రెస్​ నాయకులు పోటాపోటీగా ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆలయాల్లో బీజేపీ నాయకులు హనుమాన్​ చాలీసా పఠనం చేస్తున్నారు. ఈ రోజు మంగళవారం కావడంతో బీజేపీ నేతలు హనుమాన్​ ఆలయాలకు వెళుతున్నారు. కార్యకర్తలతో కలిసి హనుమాన్​ చాలీసా చదివిన సీఎం. బెంగలూరులోని హనుమాన్​ ఆలయానికి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వెళ్ళారు. ఆంజనేయ స్వామి గుడికి పీసీసీ చీఫ్​ డీకే శివకుమార్​ వెళ్లారు.