గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రూ. 2 లక్షల రుణమాఫీ!

గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రూ. 2 లక్షల రుణమాఫీ!

ముద్ర,తెలంగాణ:- లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు. భద్రాచలం రాముల వారి సాక్షిగా ఆగస్టు 15 లోపు రైతుల 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తానని కీలక ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల గురించి కీలక ప్రకటన చేశారు. దేశ రాజకీయాలకు ఖమ్మం జిల్లా ఒక దిక్సూచి అని.. ఈ జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులని అన్నారు. ఖమ్మం జిల్లాకు పోరాటాల గడ్డగా పేరు ఉందని.. ఈ ఖమ్మం జిల్లాతో ఎవరూ పెట్టుకోవద్దని అన్నారు.

దేశంలోనే అత్యధిక మెజారిటీతో ఇచ్చే సెగ్మెంట్ ఖమ్మం జిల్లానే అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత విసిరినా ఛాలెంజ్ ని ఆయన స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలు, 2 లక్షల రుణమాఫీ చేస్తే స్పీకర్ ఫార్మాట్ లో తాను రాజీనామా చేస్తానని.. లేదంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ ని తాను స్వీకరిస్తున్నా అని రేవంత్ రెడ్డి అన్నారు. కొమరవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత నాది అంటూ రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు.