ఆరు నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలి - సిఐటియు జిల్లా కార్యదర్శి సూర్యవంశం రాము

ఆరు నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలి -  సిఐటియు జిల్లా కార్యదర్శి సూర్యవంశం రాము

ముద్ర, పానుగల్:- గ్రామపంచాయతీ సిబ్బందికి గత ఆరు నెలలుగా ఉన్న బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సూర్యవంశం రాము అన్నారు.శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు వేసవిలో పని భారాణి తగ్గించాలని,గ్రామపంచాయతీ సిబ్బందరినీ పర్మనెంట్ చేసి వేతనాలు చెల్లించాలని,కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని అన్నారు. మల్టీపర్పస్ వర్కర్స్ విధానం రద్దు చేయాలని. పీఎఫ్,ఈఎస్ఐ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని,గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధిలైట్స్, డంపింగ్ యార్డ్స్, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు తదితర పనుల్లో నిత్యం శ్రమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అంటూ వ్యాధులు,అనారోగ్యాలు రాకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు.

గ్రామపంచాయతీ కార్మికులలో అత్యధికలు దళితులు,బలహీన వర్గాలకు చెందిన పేద కార్మికులు అని చాలీచాలని వేతనాలతో అప్పులు చేసుకుని బతకాల్సిన పరిస్థితి రాష్ట్రంలో గ్రామపంచాయతీ సిబ్బందికి ఏర్పడిందని అన్నారు.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉద్యోగులకు నెలలో మొదటి రోజు వేతనాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంది కానీ గ్రామపంచాయతీ కార్మికులకు ఆరు నెలలు గడుస్తున్న వేతనాలు చెల్లించకపోవడం దారుణం అన్నారు. కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని, కాంట్రాక్టు విధానం రద్దుచేసి కార్మికులను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి నెల 5వ తేదీ లోపు వేతనాలుచెల్లించాలని,విధి నిర్వహణలో ప్రమాదం జరిగి మరణించిన సిబ్బంది కుటుంబానికి నష్టపరిహారం 10 లక్షలు ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. దీని అమలు పోస్ట్ ఆఫీస్ బీమా పథకం ద్వారా చెల్లించాలన్నారు.సహజ మరణానికి ఇన్సూరెన్స్ ఐదు లక్షలు ఇవ్వాలని, ఎనిమిది గంటల పని,వారంతపు సెలవులు, పండుగ, జాతీయ అర్జిత సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..